తిరుపతిలో జరిగింది ఓట్ల పండుగ కాదు.. దొంగ ఓట్ల పండగని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లు స్వైర విహారం చేశారని ఆరోపించారు. వైకాపా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడి బజార్లో ఖూనీ చేసిందని విమర్శించారు. వైకాపా నాయకులు పొరుగు ప్రాంతాల నుంచి బస్సులో వాహనాల్లో దొంగ ఓటర్లను తీసుకొచ్చి.. నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిలబెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, నాయకులు అనేక చోట్ల దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారని తెలిపారు. దొంగ ఓటర్లు తమ పేరు గాని తండ్రి పేరు గాని అడ్రస్ గాని చెప్పలేకపోయారని, చాలామంది తప్పించుకొని పారిపోయారని ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి...: దొంగ ఓట్ల వెనుక ఉన్న మంత్రులపై కేసులు పెట్టాలి: యనమల