ETV Bharat / state

20 మంది మంత్రులు, 13 మంది మాజీలు ఓడిపోతారు: తులసి రెడ్డి

Tulasi Reddy Comments : కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆ పార్టీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు. ఇండియా టుడే-సీ ఓటర్ తాజా సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్‌కు 191 స్థానాలు వస్తాయని తేలిందన్నారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 లోక్​సభ స్థానాల్లో గెలిచిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని విమర్శించారు. కేబినెట్​లో ఉన్న 25మంది మంత్రుల్లో 20మంది ఓడిపోతారని.. ఐప్యాక్ సర్వేలో వెల్లడైందన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 24, 2023, 6:15 PM IST

Tulasi Reddy Comments : కాంగ్రెస్ పార్టీకి కేంద్రం, రాష్ట్రంలో పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మెన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 లోక్​సభ స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. ఇండియా టుడే - సీఓటర్ తాజా సర్వే ప్రకారం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్​కు 191 స్థానాలు వస్తాయని తేలింది. దీనిబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకున్నట్లు తెలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని విమర్శించారు.

జనవరిలో ఐ ప్యాక్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర కేబినెట్​లో ఉన్న 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని, 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారని తేలిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, కాబట్టి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తథ్యమని తులసిరెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మెన్ తులసి రెడ్డి

ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది. తిరిగి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక భరోసా.. ఒక ధీమా కలుగుతోంది. ఇండియా టుడే - సీఓటర్ అనే సంస్థలు మూడ్ ఆఫ్ ది నేషన్ అని ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్​ పార్టీకి 191 స్థానాలు వస్తాయని ఆ సర్వేలో తేలడం జరిగింది. గ్యాసు, డీజిల్,పెట్రోల్ ధరలు ఆకాశాన్నటుతుండటం.. నిరుద్యోగ సమస్య పెరగడం, అదాని కుంభకోణంతో ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రతిష్ఠ గణనీయంగా పడిపోయింది. ఇటీవల ఐ ప్యాక్ సంస్థ సర్వే నిర్వహిస్తే జగన్​మోహన్​ రెడ్డి కేబినెట్​లో ఉన్న 25 మంత్రుల్లో 20 మంది ఓడిపోతారు. 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారని ఐ ప్యాక్ సర్వేలో తేలడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వచ్చే సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో భారీగా పుంజుకొని తిరిగి పునర్వైభవం సాధిస్తుందని ఒక నమ్మకం కలుగుతోంది. -తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.