ETV Bharat / state

పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ రాష్ట్రపతికి తులసిరెడ్డి లేఖ

author img

By

Published : Jun 29, 2020, 3:19 PM IST

దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని.. రాష్ట్ర కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి విజ్ఞప్తి లేఖ రాశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు తగ్గడం లేదన్నారు.

congress leader tulasi reddy letter to president on petrol rates high
తులసిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేత

ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక పెట్రోలు, డీజిల్​పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంచారని.. రాష్ట్ర కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ద్వారా లేఖ పంపినట్లు తులసిరెడ్డి వెల్లడించారు.

అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు తగ్గినా.. దేశంలో పెట్రో ధరలు తగ్గడం లేదని తులసిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ ధరల ప్రకారం పెట్రోలు, డీజిల్ విక్రయిస్తే ధరలు తగ్గుతాయని సూచించారు. ఎక్సైజ్ సుంకం పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసి కేంద్రం తమ ఖజానా నింపుకుంటోందని ఆరోపించారు. వెంటనే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి... : టిక్​టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... తరువాత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.