Congress Leader Tulasi Reddy Fires on YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికలు.. నీతి నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవ్వడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి విమర్శించారు. 175 స్థానాలలో మొదటిగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ముఖ్యమంత్రి ఓటమిపాలు కావడం ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒక్క విద్యుత్ బిల్లులు చాలని ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ రెడ్డి హయాంలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచారని, అదనపు ఛార్జీలు వేసి ప్రజల నెత్తిపై వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తులసి రెడ్డి మండిపడ్డారు.
Tulasi Reddy Comments on 2024 Elections: శాసనమండలి ఎన్నికల్లో విద్యావంతులు, సర్పంచ్, వార్డు ఉప ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టమైందని ఆయన కడపలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అలాగే బీజేపీ ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. గుజరాత్ మోడల్ అనేది పక్కా మోసమని విమర్శించారు. స్వయానా నీతి అయోగ్ నివేదికనే ఈ విషయాన్ని వెల్లడించిందని చెప్పారు. గుజరాత్లో 38 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, మూడింట ఒక వంతు పేదలకు సొంత ఇల్లు లేవని ఆరోపించారు.
Tulasi Reddy Comments on YSRCP: 'వైసీపీ పనైపోయింది.. కాంగ్రెస్లోకి తిరిగి రండి'
Tulasi Reddy Fires on BJP: దేశానికి బీజేపీ, రాష్ట్రానికి వైసీపీ రాహు, కేతువు వలే ఉన్నారని విమర్శించారు. 1947 నుంచి 2014 వరకు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 146 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2023 వరకు మోదీ ప్రభుత్వం 109 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని విమర్శించారు. ఎప్పుడు రాష్ట్రం చేసిన అప్పులు గురించే చర్చిస్తాం తప్ప.. కేంద్రం అంతకంటే రెండింతలు అప్పు చేసిన విషయం ప్రజలకు తెలియడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా 14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని విమర్శించారు.
Tulasi Reddy Comments on Jagan: 'తండ్రి బావిని తవ్విస్తే.. కొడుకు పూడ్చినట్లుంది జగన్ వ్యవహారం'
Tulasi Reddy on YS Sharmila: ఏఐసీసీ, ఏపీసీసీ నుంచి వైఎస్ షర్మిలకు సంబంధించి ఎలాంటి సమాచారం తమకు అందలేదని.. కేవలం మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మగా మారాయని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పారు. దేశంలో ఎన్నడూ జరగని విధంగా మణిపుర్లో జరిగిన ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేస్తోందని చెప్పారు. మణిపుర్ చాలా చిన్న రాష్ట్రమని.. అక్కడ శాంతి భద్రతలను అదుపు చేయలేని ప్రధానమంత్రి.. దేశంలో శాంతి భద్రతలను ఎలా అదుపు చేస్తారని ప్రశ్నించారు.