కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో 4 రోడ్ల కూడలిని 80 అడుగుల మేర విస్తరిస్తూ మార్కింగ్ వేయడం సరికాదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. 60 అడుగుల రహదారిని 80 అడుగులు పెంచడం వల్ల అక్కడ ఉన్న కిరాణా వ్యాపారులు ఉపాధి కోల్పోతారన్నారు. ఇప్పటికే అక్కడ 2 బైపాస్ రోడ్లున్నాయని... వేంపల్లిలో ఇంత అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోందన్నారు. ప్రభుత్వం దీనిపై అన్నికోణాల్లో ఆలోచించి... ప్రజాభిప్రాయాన్నిగౌరవించాలని తులసిరెడ్డి సూచించారు.
ఇదీ చూడండి..