ప్రతిపక్షనేత జగన్, ప్రధానమంత్రి మోదీ జట్టు కట్టారని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన పదవి నుంచి దిగిపోయే సమయంలో వైకాపా, భాజపాతో కలుస్తోందని ఎద్దేవా చేశారు. వారి కలయిక బహిరంగ రహస్యమేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. విభజన హామీలు నెరవేర్చకుండా.. మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అని స్పష్టం చేశారు. ఈనెల 19 నుంచి రాష్ట్రంలో భరోసా యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...