ప్రస్తుతం జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించిన ఫాతిమా మెడికల్ కళాశాలలోనే కరోనా నిర్ధరణ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పాలనాధికారి హరికిరణ్ వెల్లడించారు. ఇవాళ్టి నుంచి రోజుకు 70 వరకు నమూనాలను పరీక్షించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 3 రోజుల పాటు రోజుకు 70 నమూనాలను పరీక్షించిన తర్వాత... ఆ సంఖ్యను 90కి పెంచుతామని చెప్పారు.
ప్రస్తుతం కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన వైద్య సదుపాయాలు, వైద్యులకు పీపీఈ కిట్లు, వెంటిలేషన్ సౌకర్యం అందుబాటులో ఉందన్న కలెక్టర్... ఒకటే అందుబాటులో ఉందని చెప్పారు. మరొకటి మంజూరైతే నిర్ధరణ పరీక్షలు వేగవంతం అవుతాయన్నారు. జిల్లాలో అనుమానిత లక్షణాలు ఎక్కువవుతున్న తరుణంలో తిరుపతికి వెళ్లకుండా కడపలోనే పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషించాల్సిన విషయమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు