ETV Bharat / state

ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి: కడప కలెక్టర్

ఆర్ధిక అభివృద్ధికి పరిశ్రమలే ఆయువు పట్టు అని కడప జిల్లా కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు దృష్టి సారించాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కలెక్టర్  సి. హరి కిరణ్
kadapa Collector Hari Kiran
author img

By

Published : Nov 10, 2020, 7:26 AM IST

కడప జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలని కలెక్టర్ సి. హరి కిరణ్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. యువతకు ఉపాధి ఇచ్చి నైపుణ్యాభివృద్ధి కల్పనలో.. శిక్షణ అందించి యువ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ముడి సరుకుగా ఉపయోగించి.. ఉత్పత్తులను అభివృద్ధి చేసేలా.. అవగాహన పెంచాలన్నారు. తద్వారా జిల్లా ఆర్ధిక ప్రగతి కూడా మెరుగుపడుతుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసి - 2015-20ని అనుసరించి ఈ ఏడాది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక రాయితీ కోసం... ఎంఎస్ఎంఈ లు దరఖాస్తు చేసుకున్నాయి. అర్హతల మేరకు ప్రస్తుతం జిల్లాలో మొత్తం 84 యూనిట్లకు గాను కేటగిరీల వారీగా ప్రోత్సాహక రాయితీ మొత్తం 4,37,13,950 లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

ఇదీ చదవండీ...

సలాం కుటుంబానిది ప్రభుత్వ హత్యే: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.