రాష్ట్రంలో నిన్న జరిగిన పోలింగ్‌లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. కడప జిల్లా పోట్లదుర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన... తెదేపాకు అనుకూలమైన ప్రాంతాల్లోనే ఈవీఎంల సమస్య రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పోలింగ్ శాతం తగ్గించడానికి వైకాపా రాజకీయాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 125 అసెంబ్లీ, 18 పార్లమెంటు స్థానాల్లో తెదేపా గెలుస్తుందని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు.
కడప జిల్లాలోనూ తెదేపా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి పదవీ వ్యామోహం ఎక్కువైందని... అందుకే రాష్ట్ర ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపారని చెప్పారు.
ఇదీ చదవండి