ETV Bharat / state

పులివెందులలో బయోటెక్ సైన్స్‌ ప్రారంభించిన జగన్​ - Pulivendula news

CM Jagan inaugurate biotech science: రెండురోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్​ జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్​.. పులివెందులలోని పశు పరిశోధన కేంద్రంలో బయోటెక్ సైన్స్‌ను ప్రారంభించారు.

CM inaugurate biotech center
CM inaugurate biotech center
author img

By

Published : Jul 7, 2022, 5:23 PM IST

CM Jagan YSR District Tour: వైఎస్సార్​ జిల్లా పులివెందులలోని పశు పరిశోధన కేంద్రంలో బయోటెక్ సైన్స్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహించేందుకు ఈ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్​బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందిస్తామని స్పష్టం చేశారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి జగన్.. వైఎస్సాఆర్ జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో పులివెందులకు వెళ్లారు. పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని బయో సైన్స్ టెక్​ను సీఎం ప్రారంభించారు.

పులివెందులలో ప్రజలకు చుక్కెదురు: జగన్​ను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు అడ్డంకులు ఎదురయ్యాయి. పులివెందుల ఆర్​అండ్​బి అతిథిగృహంలో సీఎం జగన్.. నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్నందున పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలంలో తమ భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని వృద్ధురాలు వాపోయింది. కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరడానికి వచ్చామని.. అనుమతించాలని నిరుద్యోగులు వేడుకున్నారు. తనకు ఉద్యోగం రాకపోవడానికి సీఎం జగనే కారణమని జిల్లాకు చెందిన జగన్ వీరాభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు కానీ.. బాధితుల గోడు మీడియాలో వచ్చిన తర్వాత వారి అర్జీలు అధికారులు స్వీకరించడం విశేషం.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.