ETV Bharat / state

CM JAGAN : 'ప్రముఖ నగరాల సరసన త్వరలో కడప చేరుతుంది'

author img

By

Published : Jul 9, 2021, 4:55 PM IST

Updated : Jul 9, 2021, 5:05 PM IST

కడప జిల్లాలో(kadapa district) రెండో రోజూ సీఎం జగన్(cm jagan) పర్యటించారు. నగరంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మహావీర్ సర్కిల్​లో(Mahaveer circle) శిలాఫలకాలు(Foundation stones) ఆవిష్కరించారు. డా. వైఎస్​ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరలోనే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. బుగ్గవంక(buggavanka) పెండింగ్ పనులకు నిధులు కేటాయించారు. ప్రముఖ నగరాల సరసన త్వరలో కడప కూడా చేరుతుందని ముఖ్యమంత్రి జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

cm jagan second day tour in kadapa district
కడప జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కడప జిల్లాలో రెండో రోజు పర్యటించిన సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.459.29 కోట్లతో చేపట్టే పనులకు మహావీర్ సర్కిల్‌లో శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.80 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్-రిమ్స్‌ రోడ్డును ప్రారంభించిన సీఎం.. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో రూ.5.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

త్వరలో పనులు పూర్తి..

రూ.80 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్-రిమ్స్‌ రోడ్డును ప్రారంభిన జగన్.. రూ.107 కోట్లతో నిర్మించే డా. వైఎస్‌ఆర్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేసి, త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. డా. వైఎస్‌ఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌కు టెండర్లు పూర్తయినట్లు పేర్కొన్నారు. బుగ్గవంక పెండింగ్‌ పనులకు రూ.50 కోట్లు కేటాయించారు.

రుణం తీర్చుకోలేను...

కడపలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్... కడప జిల్లాకు ఏమిచ్చినా ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. నగరంలోని రహదారులు అందంగా తయారయ్యాయని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణించాక జిల్లాను పట్టించుకున్న వారే కరవయ్యారని చెప్పారు. ప్రముఖ నగరాల సరసన త్వరలో కడప కూడా చేరుతుందని ముఖ్యమంత్రి జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

'బద్వేలు నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయి..'

Last Updated : Jul 9, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.