CM Jagan Kadapa Tour: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం కమలాపురం చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు.
24వ తేదీన ఉదయం సీఎం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందులలో రూ. 154 కోట్లతో రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తారు. అలాగే పులివెందులలో మార్కెట్ యార్డు, మైత్రి లే అవుట్ పార్కు, రాయలపురం బ్రిడ్జి, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వాటితో పాటుగా విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. కూరగాయల మార్కెట్, మైత్రి లేఔట్, రాయలపురం బ్రిడ్జి, అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.
తర్వాత ఇడుపులపాయకు బయలుదేరి 25వ తేదీ ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం తాడేపల్లికి బయలుదేరుతారు.
ఇవీ చదవండి: