ETV Bharat / state

badvel election:ఓటింగ్‌ శాతం, మెజారిటీ పెరగాలి: సీఎం - కడప జిల్లా తాజా వార్తలు

బద్వేలు ఉప ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి... మంత్రులు, పలువురు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. అక్టోబరు 4 నుంచే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని ఆదేశించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
author img

By

Published : Oct 1, 2021, 4:58 AM IST

‘బద్వేలు ఉప ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగాలి.. 2019లో కంటే మెజారిటీ కూడా ఎక్కువ రావాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రులు, పలువురు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. అక్టోబరు 4 నుంచే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా పార్టీ ఎన్నికల బాధ్యులను నియమించుకోవాలన్నారు. ఈ బాధ్యులందరితో అక్టోబరు 4న వ్యూహ రచన సమావేశం నిర్వహించుకుని, ఎన్నికల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక సన్నద్ధతపై పలువురు మంత్రులు, కడప జిల్లా ప్రజా ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ‘నెల రోజులపాటు మీ సమయాన్ని పూర్తిగా బద్వేలు ఎన్నికకే కేటాయించండి. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధను మన అభ్యర్థిగా నిలబెట్టాం. ఆమె నామినేషన్‌ కార్యక్రమానికీ మీరంతా విధిగా హాజరవ్వాలి. నియోజకవర్గంలోని ప్రతి సామాజికవర్గాన్నీ కలుపుకొని వెళ్లాలి. ఎక్కువ మంది ఓట్లు వేసేలా ప్రోత్సహించాలి. 2019లో 77 శాతం ఓటింగ్‌ నమోదైంది, దీనికంటే ఇప్పుడు పెరగాలి. 2019లో వెంకటసుబ్బయ్యకు 44 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పుడు సుధకు అంతకంటే ఎక్కువ ఆధిక్యం రావాలి. ఎక్కడా అతి విశ్వాసం వద్దు, కష్టపడి ప్రజామోదాన్ని పొందాలి. ఎన్నికల బాధ్యులు గ్రామస్థాయి పార్టీ నాయకులతో కలిసే ప్రచారం నిర్వహించాలి. ప్రతి ఇంటికీ మూడు నాలుగుసార్లయినా వెళ్లి ఓట్లు అభ్యర్థించాలి. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమేం మేలు జరిగిందో వివరించాలి’ అని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అంతకుముందు అభ్యర్థిని సుధ సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల బాధ్యులు వీరే: బద్వేలు నియోజకవర్గ వైకాపా బాధ్యుడిగా మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక సమన్వయ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. మండలాల వారీగానూ పార్టీ బాధ్యులను నియమించారు.

బద్వేలు మున్సిపాలిటీ: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి; అట్లూరు: పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే; కలసపాడు: ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే; బి.కోడూరు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే; శ్రీ అవధూత కాశినాయన: ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కడప జడ్పీ ఛైర్మన్‌; పోరుమామిళ్ల: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే; గోపవరం: చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యే

ఇదీ చదవండి:

'సుబాబుల్, యూకలిప్టస్​లకు మంచి ధర ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.