పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు కదం తొక్కారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని మేమందరమూ భారతీయులమని.. విడదీసే శక్తి ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు. ఒకే దేశం..ఒకే మతం అనే నినాదంతో భాజపా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆరోపించారు. దేశాన్ని పాలించేది ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. అందరమూ కలిసికట్టుగా పోరాటాలు చేసి..ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్లో ముస్లిం పిల్లలకు తీరని సమస్యలు వస్తాయని వారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: