ETV Bharat / state

వివేకా హత్య కేసు: పోలీసులనూ అనుమతించకుండా.. సీబీఐ రహస్య విచారణ - వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కూడా సీబీఐ అధికారుల విచారణ కొనసాగింది. కడప కేంద్ర కారాగారంలో పలువురిని విచారించిన అధికారులు... వారి నుంచి సమాచారాన్ని రాబట్టారు. విచారణను అత్యంత రహస్యంగా జరుపుతున్నారు.

వివేకా హత్య కేసులో విచారణ
వివేకా హత్య కేసులో విచారణ
author img

By

Published : Jul 11, 2021, 10:55 PM IST

మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి... కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఇవాళ ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. వారిలో వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, వంటమనిషి రంగప్ప ఉన్నారు. ఈ ముగ్గురిని వేర్వేరుగా దాదాపు ఆరు గంటల పాటు విచారించి, వారి నుంచి సమాచారాన్ని రాబట్టారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఎర్రగంగిరెడ్డి పేరు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన రోజు సాక్ష్యాలను తారుమారు చేశారని ఎర్ర గంగిరెడ్డి పై అప్పట్లో సిట్ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఈ విచారణను రహస్యంగా ఉంచుతున్న అధికారులు... పోలీసులను సైతం అనుమతించడం లేదు.

ఇదీ చదవండి:

ap fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.