Christmas celebrations across Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్‌మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రార్థనాలయాలకు పెద్దఎత్తున తరలివెళ్లిన క్రైస్తవులు ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్తుతి గీతాలను ఆలపించి.. కొవ్వొత్తులు వెలిగించి, ఏసుక్రీస్తు నామస్మరణలో మునిగితేలారు. ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ జిల్లా: పులివెందుల సీఎస్ఐ చర్చిలో ముఖ్యమంత్రి జగన్ కిస్‌మస్ పండుగ సంబరాలు జరుపుకున్నారు. తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్‌మస్ కేకు కట్ చేసి తల్లికి తినిపించారు. తల్లి విజయమ్మ కూడా జగన్‌కు కేకు తినిపించారు. పరస్పరం కిస్‌మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అయినవారితో కలిసి పండుగ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు.
ఉమ్మడి విజయనగరం: జిల్లాలో విజయనగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడంతో సందడి నెలకొంది. విజయనగరంలోని ఎస్ఎంబీ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్ధనల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి.. మంచి పనులు చేస్తూ తోటి వారికి సాయపడాలని సూచించారు.
విజయవాడ: విజయవాడలోని ప్రార్థనాలయాలన్నీ విద్యుత్ దీపాలతో, క్రిస్‌మస్ ట్రీలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. క్రీస్తు జననాన్ని తెలియచేస్తూ బొమ్మల కొలువు, పశువుల పాక ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.
నెల్లూరు: సంతపేట చర్చిలో బాలయేసును ప్రతిష్టించగా..కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతపురంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో.. తెదేపా నేత ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. నంద్యాలలో చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. యానాంలో రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. కొవ్వొత్తి వెలిగించి ప్రభువుకు మొక్కలు చెల్లించుకున్నారు. చిన్నారులు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
అనంతపురం: జిల్లాలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి క్రీస్తు భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు ఫాస్టర్ చెప్పిన యేసు క్రీస్తు జన్మ రహస్య సందేశాలను విన్నారు తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రార్థనలో పాల్గొన్నారు. మంచి మనసుతో ప్రార్థన చేస్తే దేవుడుకి అందరూ సమానులే అని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. సర్వమత సారాంశం ఒక్కటేనని అందరికీ దేవుడు ఒక్కడేనని తెలిపారు. ప్రార్థనల్లో పాల్గొన్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
ఇవీ చదవండి: