ETV Bharat / state

తుపాను బాధితులందరినీ ఆదుకుంటాం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

author img

By

Published : Dec 10, 2020, 12:07 PM IST

కడప జిల్లా రాయచోటిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పర్యటించారు. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టం అంచనా వేయాలని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

srikanth reddy
రాయచోటిలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

నివర్ తుపాను బాధితులందరికీ అండగా ఉంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్​రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటిలో వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పట్టణంలోని బీరాంసాబ్ వీధి, ఎస్​ఎస్​ ఆయిల్ వీధి, ఈద్గా రాస్తా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

వరద నీటికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఇళ్లలోకి నీరు చేరి బియ్యం, సామాను దెబ్బతిన్నాయని ప్రజలు శ్రీకాంత్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. వారి బాధలు విన్న విప్ తన వంతు సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. నష్టం వివరాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాండవ్య నదికి ఇరువైపులా రక్షణ గోడ నిర్మాణానికి అయ్యే వ్యయం అంచనా వేయాలని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని.. అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి.. '

జగన్ బినామీల కోసమే ఆ పరిశ్రమల ఏర్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.