ETV Bharat / state

నాడు-నేడు పనుల తనిఖీల్లో సీఎం కార్యదర్శి

author img

By

Published : Nov 11, 2020, 10:28 PM IST

వైఎస్సార్ కడప జిల్లాలోని వివిధ మండలాల్లో.. ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ పర్యటించారు. నాడు-నేడు పనులు జరుగుతున్న తీరు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల, పాఠశాలలు, సచివాలయాలను పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడరాదని సూచించారు.

cm secretary kadapa tour
కడప పర్యటనలో సీఎం కార్యదర్శి

నాడు-నేడు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని.. ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కడపలో ఈ పథకం కింద చేపట్టిన పాఠశాలలు, వాటిలో 9 రకాల మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు తదితరాలను.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్​తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని జయనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, వల్లూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మెయిన్, కమలాపురంలోని రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్​లలో జరుగుతున్న పనులు పరిశీలించారు.

పాఠశాలల్లోని తరగతి గదులు, ఫ్లోరింగ్, గోడలకు వేసిన పెయింటింగ్, బల్లలు, బోర్డులు, పిల్లలకు సరఫరా చేసిన బ్యాగులు, బట్టలు నాణ్యత, విద్యుత్ సౌకర్యం, స్విచ్ బోర్డులు, వంట గది, మరుగుదొడ్డి, ఆట వస్తువులు, ప్రహరీ గోడ నిర్మాణం తదితర పనుల నాణ్యతను సాల్మన్ పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లతో పాటు సభ్యులందరూ ఏయే పనులు పర్యవేక్షించారు? సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నరు. సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.

ఖాజీపేట మండలం చముళ్లపల్లిలోని గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అక్కడ అందిస్తున్న సేవలు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, రిజిస్టర్లు, కార్యదర్శుల రోజువారి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి: బ్రహ్మంసాగర్‌ జలాశయం లీకేజీని పరిశీలించిన నాయకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.