ETV Bharat / state

హైదరాబాద్​లో జోరు వర్షం - రోడ్లన్నీ జలమయం - Hyderabad Rains Today

Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 10:32 PM IST

Hyderabad Rains Today : ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన హైదరాాబాద్ నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా వర్షం పడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన దచికొట్టింది. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. జీహెచ్​ఎంసీ, డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నారు.

హైదరాబాద్​లో దంచికొట్టిన వాన (ETV Bharat)

ఆ ప్రాంతాల్లో భారీ వర్షం : ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, ముషీరాబాద్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, కోఠి, సుల్తాన్‌బజార్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముసారాంబాగ్ వంతెనను వరద తాకుకుంటూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఇరువైపులా భారీగా ట్రాఫిక్​ జాం అయింది. బేగంబజార్, అబిడ్స్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నూమ, చార్మినార్‌, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షం దంచి కొట్టింది. రోడ్లపై వాన నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

స్కూల్​కు వెళ్లాలంటే పడవ ఎక్కాల్సిందే - ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం

సీపీ ఆనంద్ అత్యవసర సమావేశం : వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. నగరంలో అధికార యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కీలకమైన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాలని అధికారులకు సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఐటీ కంపెనీలతో అనుసంధానం : ప్రజలకు ఎప్పటికప్పుడు ఐఎండీ హెచ్చరికలు, ట్రాఫిక్ జామ్ అప్​డేట్స్​ను అందించాలని సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్​లో ట్రాఫిక్ మేనేజ్​మెంట్​పై దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లు, జీహెచ్​ఎంసీ ఇతర విభాగాల ట్రాఫిక్ కమిషనర్‌లతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలో వర్షాలు కురుస్తున్న వేళ ఐటీ కంపెనీలతో అనుసంధానం చేయడం, ప్రధాన నీటి వనరులలో నీటి మట్టాలను పర్యవేక్షించడం, సాంకేతికతను పెంచడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, మూడు కమిషనరేట్ల సీపీలు, మున్సిపల్​శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో దంచికొట్టిన భారీ వర్షం - రహదారులు జలమయం - Heavy Rain in Hyderabad

దివిసీమను ముంచిన వరద- సాయం కోరుతున్న అన్నదాతలు - Farmers Problems Due to Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.