Trains Cancelled in AP : సికింద్రాబాద్ డివిజన్ పరిధి కాజీపేట- విజయవాడ సెక్షన్‌లో జరుగుతున్న భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశామని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ పేర్కొన్నారు. దీంతో పాటు మరి కొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 10 నుంచి 20 వరకు విశాఖ- ఎల్‌టీటీ(18519), 12 నుంచి 22 వరకు ఎల్‌టీటీ-విశాఖ (18520), 13న టాటానగర్-యశ్వంత్‌పూర్(18111), 9, 16న యశ్వంత్‌పూర్- టాటానగర్(18112) రైళ్లు రద్దయినట్లు ఆయన చెప్పారు .
దారి మళ్లించినవి : ఈనెల 17, 19 తేదీల్లో షాలిమార్- హైదరాబాద్ (18045), 18, 20 తేదీల్లో హైదరాబాద్- షాలిమార్ (18046) రైళ్లను వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడపనున్నట్లు కె.సందీప్ వివరించారు. 17 నుంచి 19 వరకు ముంబయి- భువనేశ్వర్- ముంబయి (11019- 11020) రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, వాడి స్టేషన్ల మీదుగా, 19న షాలిమార్- సికింద్రాబాద్ (22849) రైలు వయా విశాఖ, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి నడుపుతామని చెప్పారు.
వందేభారత్ రీ షెడ్యూల్ : ఈనెల 19, 20 తేదీల్లో విశాఖ- సికింద్రాబాద్ (20833) వందేభారత్ రైలు ఉదయం 5:45 గంటలకు బదులుగా 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు కె.సందీప్ పేర్కొన్నారు. భద్రతాపరమైన కారణాలతో విశాఖ- కిరండూల్ మధ్య నడిచే రైళ్లను దంతెవాడ వరకు కుదించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 11 వరకు విశాఖ- కిరండూల్(58501), 10 నుంచి 12 వరకు కిరండూల్- విశాఖ (58502), 8 నుంచి 11 వరకు విశాఖ- కిరండూల్ (18514), 9 నుంచి 12 వరకు కిరండూల్- విశాఖ(18513) రైళ్లు దంతెవాడ వరకే రాకపోకలు సాగిస్తాయని కె.సందీప్ వివరించారు.
విజయవాడ డివిజన్‌లో ఆరు రైళ్లు రద్దు - మరికొన్ని దారి మళ్లింపు
రైల్వే ట్రాక్ల ఆధునికీకరణ - గంటకు 130 కి.మీ వేగంతో దూసుకుపోనున్న రైళ్లు