Compensation Hike to Flood Victims in AP : ఏపీ సర్కార్ ఇటీవల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్థికసాయాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం ప్రకటనకు అనుగుణంగా : రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను మార్చుతూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఈ సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఎవరెవరికి ఎంత పెంచారంటే? : 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ఎస్‌డీఆర్‌ఎఫ్ నిర్దేశించిన రూ.11,000లకు బదులుగా రూ.25,000ల ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే మొదటి ఫ్లోర్‌లో ఉన్న ముంపు బాధితులకు రూ.10,000లు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు రూ.25,000లు, వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ.25,000ల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
అదానీ గ్రూప్ భారీ విరాళం- వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు - Donations To CM CMRF