నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళల పేరు మీద జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మహిళా సాధికారతకు పెద్దపీట అని దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కొనియాడారు. వారి సందేశాలతో ఏపీ మహిళా కమిషన్
ఛైర్‌పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ రూపొందించిన సీడీని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
మహిళల పేరు మీద ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉషా, సుధామూర్తి, అపోలో సంగీతారెడ్డి, పద్మావతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జమున, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్‌కు చెందిన ఫ్రీడా, యూనిసెఫ్ ఇండియా డా. యస్మిన్ ఆలీ హక్, కర్ణాటక, ఒడిశా, మణిపూర్, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, ఎంపీ నవనీత్ కౌర్, ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశంసలు వర్షం కురిపించారు.
ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ప్రారంభించనున్న సీఎం జగన్