CM TOUR IN YSR KADAPA ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో వైఎస్ఆర్ జిల్లా చిత్రావతి జలాశయంలో బోటింగ్ జెట్టీని ప్రారంభించారు. ప్రారంభానంతరం బోట్‌లో విహరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యేలూ.. సీఎంతో కలిసి జల విహారం చేశారు. తర్వాత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం లేక్‌వ్యూ రెస్టార్ంట్‌ను ప్రారంభించారు. లింగాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు రాత్రికి ఇడుపులపాడలోని గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
ఇవీ చదవండి: