ETV Bharat / state

తెదేపా కార్యకర్త పరమేశ్వర్ రెడ్డి హత్య కేసుపై డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు - చంద్రబాబు లేఖ

పులివెందులలో తెదేపా కార్యకర్త పరమేశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితులందరిని అరెస్టు చేయాలని, తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. 8 మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసులో న్యాయం చెయ్యాల్సిన బాధ్యత డీజీపీపైనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

cbn
cbn
author img

By

Published : Oct 9, 2022, 8:53 AM IST

Updated : Oct 9, 2022, 11:39 AM IST

పులివెందులలో తమ కార్యకర్త పరమేశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయ్యాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు. 2022 సెప్టెంబర్ 19న సింహాద్రిపురం మండలం, దిద్దెకుంట గ్రామానికి చెందిన పెద్దసోమప్ప పరమేశ్వర రెడ్డిని.. దారుణంగా హత్య చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పల్లేటి హరినాథ రెడ్డి సహా 8 మందిపై పరమేశ్వరరెడ్డి కుమారుడు అదే రోజు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఐతే 8 మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసులో న్యాయం చెయ్యాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు లేఖలో సూచించారు.

ఇవి చదవండి:

Last Updated : Oct 9, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.