ETV Bharat / state

TDP Leader B Tech Ravi: పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవిపై కేసు నమోదు - Police Filed Cases on TDP

Police Filed Cases on TDp Leader B Tech Ravi: పులివెందుల టీడీపీ ఇంఛార్జ్​ బీటెక్​ రవి పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీటెక్​ రవి సహా 30మందిపై చక్రాయపేట పోలీసులు పలు సెక్షన్ల కింద.. కేసులు పెట్టారు.

TDP Leader B Tech Ravi
TDP Leader B Tech Ravi
author img

By

Published : May 2, 2023, 8:51 AM IST

Police Filed Cases on TDP Leader B Tech Ravi: వైఎస్సార్​ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బీటెక్ రవి సహా మొత్తం 30మందిపై చక్రాయపేట పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద.. కేసులు పెట్టారు. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి స్థలంలో.. వైసీపీ నాయకులు వెంచర్లు వేస్తున్నారని తెలిసి.. ఆదివారం బీటెక్ రవి తన అనుచరులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యంపై.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఆ స్థలం తమకు చెందినదేనని.. బీటెక్ రవి తన అనుచరులతో కలిసి దౌర్జన్యంగా స్థలంలో అక్రమంగా దున్నేశారని.. వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బీటెక్ రవితో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు.

సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్ధాయికి చేరాయి: బీటెక్ రవి, తెలుగుదేశం నేతలపై కేసులను పెట్టడంపై.. టీడీపీ రాష్ట్ర అ‍ధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మండిపడ్డారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని కబ్జా చేసి వెంచర్ వేసే హక్కు.. వైసీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బీటెక్ రవితో పాటు తెలుగుదేశం నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని.. అచ్చెన్న డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నేతల అరాచకాలు తారాస్ధాయికి చేరాయని ధ్వజమెత్తారు. భూములు కబ్జా చేయడమే కాక బాధితులకు అండగా నిలబడిన వారిపై అక్రమ కేసులా అని నిలదీశారు.

పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగలగుట్టపల్లెలో కోర్టు వివాదంలో ఉన్న భూమిని వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ నేత సుబ్బయ్య కబ్జా చేశారని, బాధితుల తరపున వెళ్లి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బీటెక్ రవి, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడతారా అని మండిపడ్డారు. పులిందులలో వైసీపీ కూసాలు కదులుతున్నాయన్న భయంతోనే బీటెక్ రవిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.

కోర్టు వివాదంలో ఉన్న భూమిని కబ్జా చేసి వెంచర్ వేసే హక్కు వైసీపీ నేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సొంత నియోజకర్గంలో పేదల భూములు కబ్జాకు గురవుతుంటే జగన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి వీటిలో వాటాలున్నాయా అని ప్రశ్నించినా అచ్చెన్న.. ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. పోలీసులు కబ్జాదారులపై చర్యలు చేపట్టి బీటెక్ రవితో పాటు తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.