నివర్ తుపాను పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం కడప జిల్లాలో పర్యటిస్తోంది. ఇప్పటికే రైల్వేకోడూరు, రాజంపేట, కడపలో బృందం సభ్యులు పర్యటించారు. రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లిలో గుంజనేరు వంతెనను పరిశీలించారు. చియ్యవరం పరిధిలోని చియ్యవరం ఏరు వంతెనను బృందం పరిశీలించింది. నష్టపోయిన వంతెనలు, పంట పొలాల ఫొటోలు చూపించి వారికి వివరించారు. అనంతరం పుల్లంపేటలో పర్యటించనుంది
ఇదీ చదవండి: 'పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదు'