కడప జిల్లా దువ్వూరు సమీపంలోని గోరి స్వామి దర్గా వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. సుండుపల్లె వాసులు హైదరాబాదు నుంచి కారులో వస్తూ ఉండగా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
రాయచోటి మండలం కొత్తపేట రామాపురం గ్రామానికి చెందిన పెద్దవీటి ప్రభాకర్ (30)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శరణ్య (30) అనే మహిళను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న దువ్వూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: