యురేనియం తవ్వకాల నుంచి కడప జిల్లాను కాపాడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాహుల్ డిమాండ్ చేశారు. పులివెందుల ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన...బాధితులకు న్యాయం చేయాలని కోరారు. యూసీఎల్ ఫ్యాక్టరీ, శుద్ధి కర్మాగారం వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. రకరకాల వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. ప్రజలు చర్మవ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
ఇదీచదవండి