జీవనోపాధి కోసం కువైట్ కు వలస వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ (48).. మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అక్కడి మిత్రుల ద్వారా తమకు సమాచారం అందిందని మృతుడి కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా కారణంగానే అతను చనిపోయాడేమే అని కొందరు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: