ETV Bharat / state

'నిధులు వచ్చాయి.. పునరావాస పరిహారం పంపిణీ పూర్తి చేయండి'

గండికోట ఆర్ అండ్ ఆర్ పనులపై కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్.. అధికారులతో సమావేశం నిర్వహించారు. పునరావాస ప్యాకేజీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

cadapa distrivt collector meeing about gandikota money

author img

By

Published : May 17, 2020, 8:01 AM IST

కడప జిల్లా గండికోట పునరావాస పరిహారం పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై సమావేశం నిర్వహించిన కలెక్టర్.. ప్రభుత్వం ఇప్పటికే రూ.145 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు.

ఈ నిధులతో నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గండికోటలో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన చర్చించారు.

ఇదీ చూడండి:

వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.