ETV Bharat / state

కడప జిల్లాను ముంచేసిన సోమశిల

ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలకు సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. పంట పొలాలకు నీరు వస్తుందని... జలాశయం దిగువ ప్రాంతాన ఉన్న నెల్లూరు ప్రజలు ఓ వైపు సంతోషంగా ఉన్నా... సోమశిల వెనుక జలాల వల్ల కడప జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది.

cadap-district-floods-problems
author img

By

Published : Oct 16, 2019, 6:52 PM IST

కడప జిల్లాను ముంచేసిన సోమశిల

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి రికార్డుస్థాయిలో నీరు చేరింది. మొన్నటి వరకూ గరిష్ఠస్థాయిలో నీటి ప్రవాహం ఉండటం వల్ల దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వల్ల పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహించింది. నది మీద ఉన్న వంతెనల మీదుగా నీరు ప్రవహించడం వల్ల... ముందు జాగ్రత్తగా అధికారులు సోమశిల గేట్లు మూసేశారు. దీని వల్ల జలాశయం నుంచి వెనక్కి మళ్లిన జలాలు... కడప జిల్లాలోని ముంపు గ్రామాలను నీటముంచాయి.

కడప జిల్లా అట్లూరు, గోకవరం మండలాల్లోని... బుడ్డిచర్ల, సూరేపల్లి, వరికుంట, వాండ్లపల్లి, ఆకుతోట తదితర గ్రామాలు నీటమునిగాయి. ఇళ్లు, భూములు కోల్పోయి అక్కడివారు నిరాశ్రయులయ్యారు. చుట్టూనీరు ఉండటం వల్ల రాకపోకలు స్తంభించాయి. పాములు, తేళ్లు వంటి విషప్రాణులు... ఇళ్లలోకి, పాఠశాలలోకి రావడంతో భయంతో వణికిపోతున్నారు. తమకు ఇస్తామన్న పరిహారం చెల్లించి... న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అనేకసార్లు తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కలసినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందారు.

సోమశిల జలాశయం నిర్మాణం వల్ల అట్లూరు, గోపవరం, ఒంటిమిట్ట నందలూరు మండలాల్లోని 150 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గతంలో కొన్ని గ్రామాల్లో బాధితులకు పరిహారం చెల్లించారు. ఇంకొన్ని గ్రామాల్లో పరిహారం చెల్లింపు అసంపూర్తిగానే ఉంది. కొంతమందికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇళ్లు కట్టుకునే స్థోమత లేక చాలా మంది ఆ గ్రామాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. గతంలోనూ వరదలు వచ్చాయిని... ఈ స్థాయిలో గ్రామాలను ఎప్పుడూ ముంచలేదని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలిపారు.

వరదల్లో కొట్టుకుపోయి కొందరు, పాములు కాటేసి, విషజ్వరాలు వ్యాపించి మరికొందరు మరణించారని స్థానికులు తెలిపారు. మరింత మంది ప్రాణాలు పోకమునుపే తమకు అక్కడ నుంచి పునరావాస ప్రాంతానికి తరలించాలని వేడుకుంటున్నారు.

Intro:444

Body:777

Conclusion: విజువల్స్ ఇంతకుముందు ఫైల్ లో పంపాను.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.