కడప జిల్లా మైదుకూరులో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఏ డిపోకు లేనివిధంగా ప్రయాణికులతో పాటు ఇతర బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా... అదే స్థాయిలో సమస్యలు వెంటాడుతున్నాయి. బస్టాండ్ పరిసరాలు ప్రయాణికులకు ఏవగింపు పుట్టిస్తున్నాయి. లోనికి ప్రవేశించే దారితో పాటు బయటకు వెళ్ళే దారి పూర్తిగా పాడైపోయింది. కొన్ని చోట్ల పెద్ద గోతులు ఉన్నా మరమ్మతులు లేక ..చినుకు పడితే వర్షపు నీరు నిల్వ చేరి.. చిత్తడిగా మారుతోంది. ఇక్కడికి ప్రయాణికులు రావాలన్నా భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించే వారికి సేవా రుసుము వసూలు చేస్తున్న యాజమాన్యం.. బస్టాండ్ బాగుకు చర్యలు తీసుకోకపోవడం మాత్రం విడ్డూరం.
ఇదీచూడండి