ఆన్లైన్ గేమ్ ఆడుతుంటే మందలించారని మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. సీయోనుపురానికి చెందిన అనిల్ కుమార్ నగరంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాళాలకు వెళ్లకుండా ఓ ఆన్లైన్ గేమ్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో పెదనాన్న జైపాల్ మందలించగా.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2016లో మనస్పర్థలతో అనిల్ తల్లిదండ్రులు విడిపోగా.. పెదనాన్న జైపాల్ వద్ద ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలి: ఎస్పీ అన్బురాజన్