కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని కారణంగా... బీఎస్ఎన్ఎల్ భవనాన్ని పురపాలక అధికారులు జప్తు చేశారు. 2004 నుంచి పన్నులు చెల్లించలేదని నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. ఇప్పటివరకు 64 లక్షల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ దఫా వడ్డీ మాఫీతో కలిపి 30 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పినా... స్పందన కరువైందని వివరించారు. ఈ కారణంగానే.. జప్తు చేయాల్సి వచ్చిందనిఅధికారులు స్పష్టం చేశారు. మరో వైపు తమతో పురపాలక అధికారాలు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ...కార్యాలయం ఎదుట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరసనకు దిగారు.
ఇదీ చదవండి
ఏపీ రాజకీయ రాగంలో తెలంగాణ తాళం