కడప జిల్లా కమలాపురం మండలం గొల్లపల్లె వద్ద రాత్రి కురిసిన వర్షానికి వంతెనపై గొయ్యి పడింది. నిత్యం రద్దీగా ఉండే కడప, తాడిపత్రి రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. గతంలోనూ ఈ వంతెనకు ఇలాగే రంధ్రం పడిందని స్థానికులు చెబుతున్నారు. నాణ్యత లోపం వల్లే తరచుగా గోతులు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం డబ్బులు వెచ్చించి.. నాణ్యత లోపం ఉన్న వంతెన నిర్మించడం ఏమిటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు త్వరితగతిన చేపట్టి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
ఇదీ చదవండి: తిరుమలలో 'ఆ' నిబంధనను ఇప్పుడే ఎందుకు మార్చారు.. ?: ఐవైఆర్