వెలుగోడు జలాశయం నుంచి తెలుగుగంగ నీరు విడుదల చేయగా జిల్లా సరిహద్దుకు చేరుకున్నాయి. 8 రోజులలో నీటి ప్రవాహం 0.87 టీఎంసీల నీరు ఒకటో ఉప జలాశయంలోకి చేరి రెండో ఉప జలాశయంలోకి నీరు చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. 2.44 టీఎంసీల సామర్థ్యం కలిగిన రెండో ఉపజలాశయంలో ప్రస్తుతం 0.20 టీఎంసీల నీరు నిల్వ ఉండగా మరో 0.939 టీఎంసీలు చేరితే బ్రహ్మం సాగర్ జలాశయం దిశగా నీరు ప్రవహించే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:రాజధానిలో ఆగని రైతుల ఆందోళనలు