ETV Bharat / state

ముప్పుందని తెలుసు.. ఎందుకంత అలుసు? - brahmam sagar negligence latest news

‘ఆర్థిక పురోగతితోపాటు పేదరికం లేని సామాజిక అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు మూలస్తంభాలు’. ఇదీ కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి ఆయకట్టు ప్రాంతాలకు సెప్టెంబరు 27, 2006లో తొలిసారిగా నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకంపై ఉన్న మాటలివి. అయితే జిల్లాలో కీలకమైన ఈ జలాశయం ఉద్దేశానికి తూట్లు పడుతున్నాయి. దీని ఆనకట్టకు లీకేజీల ముప్పు పొంచి ఉండగా నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

brahmam sagar leakage negligence
బ్రహ్మంసాగర్‌ జలాశయం
author img

By

Published : Oct 24, 2020, 7:29 PM IST

కృష్ణా జలాలను కరవు పల్లెలకు మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. ఇందుకు తగ్గట్లుగానే వరుణుడు కరుణించడంతో జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వ చేసేందుకు అవకాశం కలిగింది. అయితే ఇందుకు సరైన ప్రణాళిక కొరవడడంతో లక్ష్యం నీరుగారుతోంది. కడప జిల్లాలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి(బ్రహ్మం సాగర్‌) జలాశయంలో లీకేజీలతో పూర్తి సామర్థ్యంతో నింప లేకపోతున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా 17.74 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మంగారిమఠం మండలంలో ఉన్న ఈ జలాశయానికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రూపకల్పన చేశారు. బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలనేది దీని ప్రధాన లక్ష్యం. 2006లో పూర్తయిన ఈ జలాశయం ప్రధాన మట్టి ఆనకట్ట పొడవు 2.50 కిలోమీటర్లు కాగా, ఎత్తు 50 మీటర్లు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలతోపాటు హెడ్‌ స్లూయిస్‌, రక్షణ గోడలు, కుడి, ఎడమ వైపున హెడ్‌ స్లూయిస్‌, రాతి పరుపు నిర్మాణాలు పూర్తిచేశారు. సుమారు రూ.100 కోట్లు ఖర్చుపెడితే జలాశయంలో పూర్తిసామర్థ్యం నీటిని నింపడంతోపాటు చివరి ఆయకట్టు వరకు సాగునీరందించడానికి అవకాశం ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది.

శాశ్వత పరిష్కారానికి రూ.50 కోట్లు అవసరం
2007లో బ్రహ్మంసాగర్‌ జలాశయంలో తొలిసారిగా 13 టీఎంసీల నీటిని నిల్వచేయగా ఆనకట్ట నుంచి లీకేజీలేర్పడ్డాయి. 2010లో 11.84 టీఎంసీలు నింపగా మళ్లీ లీకేజీలేర్పడ్డాయి. నిర్మాణ లోపాలు, ఒకేసారి భారీగా నీటిని నిల్వ చేయడం తదితర కారణాలతో లీకేజీలేర్పడుతున్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరులశాఖకు సంబంధించిన నిపుణుల కమిటీ పలుమార్లు పరిశీలించి సూచనలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ మరోసారి జలాశయాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. తాత్కాలికంగా ఆనకట్ట బయట వైపున ఇసుక ఫిల్టర్‌ ఏర్పాటు చేయాలని, శాశ్వతంగా లీకేజీని అరికట్టాలంటే గరిష్ఠ నీటిమట్టం 216.5 మీటర్ల నుంచి దిగువ స్థాయి వరకు 100 మీటర్లు పొడవు, 50 మీటర్ల ఎత్తులో డయాఫ్రం వాల్‌ నిర్మించాలని సూచించింది. ఇందుకోసం సుమారుగా రూ.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే నెలలు గడుస్తున్నా నిధుల ఊసే లేదు.

అసంపూర్తిగా పంట కాలువలు
2004-05లో బ్రహ్మంసాగర్‌ జలాశయ కుడి, ఎడమ ప్రధాన కాలువలు, పంట కాలువల నిర్మాణాలను రూ.200 కోట్లతో ప్యాకేజీ-3 కింద చేపట్టారు. ఐవీఆర్‌సీఎల్‌, ఎస్‌ఈ డబ్ల్యూ సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో పనులు దక్కించుకున్నాయి. 15 ఏళ్లు గడిచినా పంట కాలువల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. 2010-11లో ప్యాకేజీ-3 కింద సీసీ లైనింగ్‌ పనులకు రూ.122 కోట్లతో టెండరు పిలిస్తే ఆయా సంస్థలు దక్కించుకుని పనులు చేపట్టాయి. ఈ మేరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని ఇంజినీర్లు అంటున్నారు. అయితే పిల్ల కాలువల నిర్మాణ పనులను ఎక్కడికక్కడ అసంపూర్తిగా వదిలేశారు. అసంపూర్తి పంట కాలువల నిర్మాణంతోపాటు మరమ్మతులు చేసి ఆయకట్టుకు సాగునీరందించాలంటే సుమారు రూ.30-40 కోట్లు అవసరమని ఇంజినీర్ల అంచనా. ఇటీవల పనులు చేసిన గుత్తేదారు సంస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అసంపూర్తి పనులకు నాలుగేళ్ల వరకు ఎలాంటి నిధులివ్వలేమని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సారి 14 టీఎంసీల వరకు నిల్వ
ప్రతి ఎర్త్‌ డ్యాంలో మెల్లగా నీటినిల్వ పెంచాలి. 2007-08లో ఒకేసారి 13 టీఎంసీలు నింపడంతో లీకేజీలేర్పడ్డాయి. ఆ సమయంలో జలాశయం నుంచి 160 క్యూసెక్కుల మాత్రమే విడుదల చేసినా ఆనకట్ట నిలిచి ఉంది. నిపుణుల కమిటీ సూచించిన మేరకు సుమారు రూ.50 కోట్ల పనులను చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అయితే ఈ ఏడాది నీళ్లు అందు బాటులో ఉండడంతో జలాశయంలో ఎక్కువగా నిల్వ చేసేందుకు ప్రయత్నించాలని ఉన్నతాధికారులు సూచించారు. లీకేజీలపై అప్రమత్తంగా ఉంటూ.. తాత్కాలిక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం 12.5 టీఎంసీలు నిల్వచేయగా, మరో మూడు రోజుల్లో 13 టీఎంసీలకు పెంచుతాం. అనంతరం పరిస్థితులను బట్టి 14 టీఎంసీల వరకు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - శారద, ఎస్‌ఈ, తెలుగుగంగ ప్రాజెక్టు, కడప

ఇదీ చదవండి :

కొనసాగుతోన్న బ్రహ్మంసాగర్ జలాశయం నీటి లీకేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.