ETV Bharat / state

BOY MURDER CASE: బాలుడు తనీష్​రెడ్డి హత్య కేసు ఛేదన.. నిందితుడు అరెస్డ్​

క‌డ‌ప‌ జిల్లా వెంగళాయపల్లెకు చెందిన జి.తనీష్‌రెడ్డి (9) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిని హతమార్చిన దస్తగిరిని అరెస్ట్​ చేశారు.

బాలుడు తనీష్​రెడ్డి హత్య కేసు ఛేదన
బాలుడు తనీష్​రెడ్డి హత్య కేసు ఛేదన
author img

By

Published : Aug 13, 2021, 8:31 PM IST

Updated : Aug 13, 2021, 10:14 PM IST

క‌డ‌ప‌ జిల్లా రాజుపాలెం మండలం వెంగళాయ‌ప‌ల్లెలో అదృశ్యమై శవంగా తేలిన బాలుడు తనీష్​రెడ్డి (9) కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 7న అదృశ్యమై 9న శవమై కనిపించిన త‌నీష్‌రెడ్డిని.. దస్తగిరి అనే వ్యక్తి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. ద‌స్త‌గిరి కుమార్తె (10 సంవ‌త్స‌రాలు)తో త‌నీష్‌రెడ్డి తరచూ గొడ‌వ‌ప‌డుతుండేవాడని.. అది మ‌నసులో పెట్టుకుని బాలిక తండ్రి బాలుడిని హ‌త్య చేశాడని డీఎస్పీ ప్రసాదరావు వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు అపోహ‌ ప‌డుతున్న‌ట్లు బాలుడి మృతి న‌ర‌బ‌లి కాద‌న్న డీఎస్పీ.. తనీష్​ ఒంటిపై గాయాలేవీ లేవ‌ని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

రాజుపాలెం మండలం వెంగళాయపల్లెకు చెందిన జి.తనీష్‌రెడ్డి(9) మృతదేహాన్ని సోమవారం రాత్రి పోలీసులు గుర్తించారు. గ్రామం వెలుపల రోడ్డు పక్కన ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం సమీపంలోని తాగునీటి కేంద్రానికి వెనుక వైపు ముళ్ల పొదల్లో బాలుడు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు సంజీవరెడ్డి, శోభారాణి భోరున విలపించారు. ఈ నెల 7న తమ కుమారుడు కనిపించడం లేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద ఎస్సై కృష్ణంరాజు నాయక్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు రక్షిత నీటి కేంద్రం వెనుక వైపు ముళ్ల పొదల్లో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. బాలుడు శవమై కన్పించడంతో అందుకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నామని సీఐ మధుసూదన్‌ గౌడ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

Letter: మాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ

విషాదాంతం : అదృశ్యమైన బాలుడు మృతి

Last Updated : Aug 13, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.