పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం.. నష్టాల్ని భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచి ప్రజలను హింసిస్తోందని భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి(bhanuprakash reddy) ఆరోపించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట 'అన్నవచ్చాడు-పన్ను పెంచాడు' నినాదంతో ఆందోళన నిర్వహించారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న పన్ను పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలను ఉద్ధృతం చేస్తామని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ.. కడప జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయం వద్ద భాజపా నాయకులు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉచిత పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచడం సమంజసం కాదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి పన్ను పెంపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి: cross firing: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురు మృతి?!