వైకాపా ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వటం అంతా మోసమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలకు అనువైన ప్రాంతంలో కాకుండా కొండలు గుట్టల్లో స్థలాలు ఇవ్వటం దారుణమన్నారు. కడప శివారులో పేదలకు ఇస్తున్న భూములను భాజపా జిల్లా రాష్ట్ర నాయకులు పరిశీలించారు. కనీసం సెంటు కూడా లేకుంటే నివాసాన్ని ఎలా నిర్మించికుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేవలం అధికార పార్టీకి, అధికారులకు డబ్బులు సంపాదించి పెట్టే పథకాన్ని ప్రవేశ పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్థలాలను రద్దు చేసి జనావాసంలో స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి ప్రధానవార్తలు@3PM