కడప జిల్లా బద్వేల్(badvel) ఉపఎన్నికలో ఓటమి భయంతో వైకాపా దౌర్జన్యాలకు తెరలేపిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veeraju), మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి(adi narayana reddy) ఆరోపించారు. 28 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్(repolling) కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. దొంగ ఓట్లు వేసుకునేవారికి భాజపాను విమర్శించే హక్కు లేదన్నారు. పలు పోలింగ్ కేంద్రాలలో.. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయించారని, పోలీసులు కూడా దొంగ ఓట్లను పట్టించుకోలేదని ఆరోపించారు.
53 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ జరగలేదు, కానీ 63 శాతం పోలింగ్ జరిగిందంటే దొంగ ఓట్లు పడ్డాయని అన్నారు. కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో కోనరాజుపల్లెలో ఏజెంట్గా కూర్చుని.. బస్సులో ఓటర్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. భాజపా ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
వంద కోసం వార్డుబాయ్ కక్కుర్తి.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి