ETV Bharat / state

'ఆ నిర్ణయాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి'

తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఉపవాస దీక్ష చేపట్టారు. స్వామి వారి భూములను వేలం వేయాలనే నిర్ణయం... భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు.

bjp fasting strike for abolition of ttd assets bid permanently
తితిదే ఆస్తుల వేలం శాశ్వత రద్దుకు భాజపా ఉపవాస దీక్ష
author img

By

Published : May 27, 2020, 7:13 AM IST

తితిదే ఆస్తుల వేలం నిర్ణయాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఉపవాస దీక్ష చేపట్టారు. 150 సీట్లు వచ్చాయన్న అహంకారంతో జీవో నెంబర్ 39 ద్వారా దేవాలయ భూములను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తోందని ఆరోపించారు. స్వామి వారి భూములను వేలం వేయాలనే నిర్ణయం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.

తాము చేపట్టిన ఉపవాస దీక్షలతోనే... శ్రీవారి ఆస్తుల వేలం ప్రకటనను తితిదే వాయిదా వేసిందని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువులు మేల్కొని ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో శ్రీవారి లడ్డూల విక్రయం అన్నది.. లడ్డూ ప్రసాద పవిత్రతను దెబ్బతీయడమేనని ఎల్లారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.