కడప జిల్లా రాజుపాలెం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి విలువలి గ్రామంలోని కొన్ని వీధుల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది .దీంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కంటున్నారని విషయం తెలుసుకున్న మండల అధికారులు అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం రోడ్లపై నీటిని జెసీబీ సహాయంతో కాలువలు తీసి వాటి ద్వారా గ్రామంలోని నీటిని బయటకు పంపించేలా చర్యలు చేపట్టారు.
ఇదీచూడండి.నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు