దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కడప కూడలిలోని సిండికేట్ బ్యాంకు వద్ద ఉద్యోగుల ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వారంలో ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని... కుటుంబ పింఛన్ అమలుపరచాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరిలో మరో మూడు రోజులు సమ్మె చేస్తామని కడప బ్యాంకు అధికారుల సంఘం నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అప్పటికీ స్పందించకుంటే మార్చి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
ఇదీచూడండి.రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోంది: జనసేన నేత హరిప్రసాద్