కరోనా మహమ్మారి వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే మగ్గిపోతున్న కాయలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. లాభాల సంగతి అలా ఉంచితే... కనీసం పెట్టిన పెట్టుబడి రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలంలో వందల ఎకరాల్లో అరటిని సాగుచేస్తున్నారు. దశాబ్దాలుగా ఏదో రకంగా తాము నష్టపోతూనే ఉన్నామని.. ఈ ఏడాది కరోనా రూపంలో మరింత నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంట తోటలోనే మాగిపోతోందని.. వ్యాపారులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: