ETV Bharat / state

badvel election: బద్వేలు ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారి నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. పోటీలో ఉండే అభ్యర్థులకు ఏమైనా నేరచరిత్ర ఉంటే... ప్రజలకు తెలియజేసే విధంగా రాజకీయ పార్టీలకు చెందిన వెబ్ సైట్లో పొందు పరచాలనే సుప్రీంకోర్టు ఉత్తర్వులు... బద్వేలు ఉప ఎన్నికల నుంచే ఎన్నికల సంఘం అమలు చేయనుంది.

ద్వేలు ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్
ద్వేలు ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్
author img

By

Published : Oct 1, 2021, 2:08 AM IST

బద్వేలు ఉప ఎన్నిక కోసం నేటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశమిచ్చారు. అక్టోబరు 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నుంచి నాలుగేళ్లు పైబడి బద్వేలు నియోజకవర్గంలో పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓలను బదిలీ చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు... ప్రచార సమయంలో ఇళ్లమధ్య సభలు నిర్వహించుకుంటే 200 మందికి మించి ఉండరాదని నిబంధనలు పెట్టారు.

ఎన్నికల స్టార్ కాంపెయినర్లు వస్తే వారి సభలకు వెయ్యిమంది, స్టార్ కాంపెయినర్లు కానివారి సభకు 500 మందికి మించకుండా సభ నిర్వహించు కోవాలని ఈసీ నిబంధనలు విధించింది. రోడ్ షోలు, బైక్ ర్యాలీలు చేపట్టకూడదని... ఇంటింటి ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు కేవలం ఐదుగురు మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలని నిబంధనలు విధించారు .

ఈసారి జరిగే బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత... వారు నేరచరిత్ర కల్గి ఉంటే రాజకీయ పార్టీ వెబ్ సైట్ లో పొందు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈఏడాది ఆగస్టు 10న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి వెబ్ సైట్ లో "అభ్యర్థుల నేరచరిత్ర" అనే శీర్షికను మొదటి పేజీలో ప్రచురించాలని తెలిపారు. ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

I CET RESULTS: నేడు ఐసెట్ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.