ఇదీ చదవండి :
'మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానినీ తప్పు పడతారేమో' - chandrababu on ycp govt
మాతృభాష గొప్పదనాన్ని వివరించినందుకు ప్రధాని మోదీని కూడా వైకాపా విమర్శిస్తుందేమోనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబు.. నియోజకవర్గ నేతలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మాతృభాషపై మాట్లాడినందుకు .. ప్రధానినీ పడతారేమో ? : చంద్రబాబు
మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధాని మోదీని కూడా వైకాపా నేతలు తప్పుపడతారేమోనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని విమర్శించిన వారు... ప్రధానిని తప్పుపట్టేందుకు వెనకాడరన్నారు. వైకాపా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎవరూ అధైర్యపడవద్దని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. 3 రోజుల కడప పర్యటనలో భాగంగా తొలిరోజు రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. వైకాపా పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. అంతర్గత సమావేశంలో పార్టీ పరిస్థితి... బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నేడు మిగిలిన ఆరు నియోజకవర్గాలతో అధినేత సమీక్షలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి :