ETV Bharat / state

'జనవరి 15 తర్వాత యూనిఫారం లేకుండా కనిపిస్తే.. కేసులు' - కడప తాజా

కడప పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు డీఎస్పీ కీలక సూచనలు చేశారు. జనవరి 1 నుంచి కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ అన్ని పత్రాలను దగ్గర పెట్టుకుని ఆటో నడపాలని సూచించారు. జనవరి 15 తర్వాత యూనిఫారం లేకుండా ఆటో నడిపితే.. డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

Awareness program for auto drivers at Kadapa DSP office
'జనవరి 15 తర్వాత ఖాకీ యూనిఫారం లేకుండా కనిపిస్తే.. కేసులు నమోదు'
author img

By

Published : Dec 31, 2020, 1:06 PM IST

కడప డీఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 15 తర్వాత ఖాకీ యూనిఫాం లేకుండా ఆటో నడిపితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్నుల విధానంతో.. ప్రతి ఒక్కరూ అన్ని పత్రాలను దగ్గర పెట్టుకోవాలని సూచించారు.

మద్యం తాగి ఆటో నడిపితే రూ. 10వేల వరకు జరిమానా తప్పదని హెచ్చరించారు. ఎవరైనా చెడు అలవాట్లకు బానిసై.. లేనిపోని సమస్యలను సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ఆటోల్లో స్పీకర్లు, అదనపు సీట్లు ఉంటే వెంటనే తొలగించాలని తెలిపారు.

ఇదీ చదవండి:

సుబ్బయ్య హత్యోదందం.. విపక్షం, అధికార పార్టీల మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.