Awards to Dance School: కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎమ్ఆర్ (YMR) కాలనీలోని నృత్య తరంగిణి కళానిలయంలో వందకు మందికి పైగా బాలికలు కూచిపూడి నేర్చుకుంటున్నారు. స్థానికులతో పాటు మైదుకూరు, ఇతర గ్రామాల నుంచి వచ్చి.. శిక్షకుడు శ్రావణ్‌కుమార్ వద్ద తర్ఫీదు తీసుకుంటున్నారు. ఒకవైపు చదువుకుంటూనే.. ఖాళీ సమయాల్లో కూచిపూడి నేర్చుకుంటున్నారు. సెలవు దినాల్లో ఉదయం, సాయంత్రం నృత్య తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన వారంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు సైతం సొంతం చేసుకుంటున్నారు. పోటీల్లో అవార్డులు గెలుచుకోవటం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
ఆల్ ఇండియా స్థాయి నృత్య పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
ఇటీవల చిలకలూరిపేటలో కళానిలయం వారి 37వ ఆల్ ఇండియా స్థాయి నృత్య పోటీలు జరిగాయి. ఏపీతో పాటు తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పోటీల్లో పాల్గొన్నారు. అందులో ప్రొద్దుటూరులోని తరంగిణి నృత్య కళానిలయానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. శిక్షకుడు ఇచ్చే మెళకువలు తెలుసుకుంటూ నాట్యంపై మరింత పట్టు సాధించి, మరిన్ని అవార్డులు గెలుచుకుంటామని బాలికలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Hanuman Land: ఈనె 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలానికి భూమిపూజ