ETV Bharat / state

పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో వెంటాడుతూ.. ఫ్యాక్షన్ సినిమా సీన్.. ఎక్కడంటే? - It is worse in Kadapa district

Murder Attempt in YSR District : పట్ట పగలే ఒక వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో వెంటాడుతూ, హత్యా చేసే దృశ్యాలు.. కడప జిల్లా బద్వేలు పట్టణంలో కనిపించాయి. అచ్చం ఫ్యాక్షన్ సినిమాలోని దృశ్యంలా కనిపించిన ఈ ఘటనలో.. బాలయ్యపై అనే బాధితుడిపై ప్రత్యర్థులు ఈ దారుణానికి ఒడికట్టారు. నడిరోడ్డుపై వెంటాడుతున్న దుండగుల నుంచి స్థానికులు సహకారంతో బాధితుడు చిన్నపాటి గాయాలతో తప్పించుకొన్నాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Attempt Murder
వ్యక్తిపై హత్యాయత్నం
author img

By

Published : Jan 21, 2023, 7:58 PM IST

Attempt Murder: కడప జిల్లా బద్వేలు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఆర్ధికలావాదేవిల వివాదంలో ఉన్న ఓ వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చడానికి కత్తులతో వెంబడించారు. ఫ్యాక్షన్ సినిమాల్లో వెంటాడినట్లుగా.. నడిరోడ్డుపై కత్తులతో వెంటాడుతున్న దృశ్యాలు, స్థానికలను భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యర్ధుల నుంచి తప్పించుకునేందుకు చాలా దూరం పరుగెత్తిన బాధితుడికి.. కొందరు సహకారించడంతో, ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో అతని చేతి వేళ్లు తెగిపడ్డాయి. వైఎస్ఆర్ జిల్లా బి కోడూరు మండలం రామసముద్రం గ్రామానికి చెందిన బాలయ్య తన వాహనం కోసం డీజిల్ తీసుకెళ్లేందుకు.. బద్వేలులో ఉన్న పెట్రోలు బంక్ వద్దకు వచ్చారు. అక్కడ పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తికి, బాలయ్యకు మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో డీజిల్ కోసం వచ్చిన బాలయ్యపై.. నిందితులు కత్తులతో ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో దాడి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపైకి పరిగెత్తిన బాధితుడిని వెంటాడారు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నా.. బాధితుడి చేతి వెళ్లు తెగిపోయాయి. ప్రాణపాయం నుంచి బయటపడ్డ తర్వాత, అతడ్ని చికిత్స నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి తరువాత మళ్లీ కడప రిమ్స్ కు బాలయ్యను తరలించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

కాగా వీటి ఆధారాలతో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన వారు బద్వేలు పట్టడానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పట్టపగలు నడిరోడ్డు మీద ఈ ఘటన జరగడంతో దారిన వెళ్లే ప్రజలు భయోత్పతానికి లోనయ్యారు.

పట్టపగలే నడి రోడ్డుపై యాక్షన్ సీన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.